![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో రెండో ఫైనలిస్ట్ కోసం జరిగే పోరులో అందరు ఎలిమినేట్ అవ్వగా రేస్ లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. స్కోర్ బోర్డుపై పాయింట్స్ పెంచుకునేందుకు నెక్స్ట్ టాస్క్ లో పాల్గొనవద్దన్న వాళ్ళని సెలెక చెయ్యండి అని బిగ్ బాస్ చెప్పాడు. అందరు సంజన పేరు చెప్తారు. ఈ టాస్క్ లో తనూజ,ఇమ్మాన్యుయేల్ మాత్రమే ఆడుతారు. సంఛాలక్ గా సంజన ఉంటుంది. బజర్ మోగినప్పుడు బెలూన్ ని చేతితో కాకుండా గాల్లో ఎగిరెస్తూ జాలిలోకి పడెయ్యాలి. అలా టాస్క్ మొదలు అయినప్పుడే ఇమ్మాన్యుయేల్ కాలు బెనుకుతుంది.
టాస్క్ ని పాజ్ చేసి ఇమ్మాన్యుయేల్ ని మెడికల్ రూమ్ కి తీసుకొని వెళ్తారు. తన కాలికి పట్టికట్టి పంపిస్తారు. టాస్క్ మళ్ళీ మొదలవుతుంది. టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విన్ అవుతాడు. లాస్ట్ వరకు వచ్చి మిస్ అయిందని తనూజ ఎమోషనల్ అవుతుంది. ఇదే నా జీవితం ఎప్పుడు ఇలాగే జరుగుతుందని అంటుంది. ఆ తర్వాత స్కోర్ బోర్డులో ఇమ్మాన్యుయేల్, తనూజ లీడ్ లో ఉంటారు. మళ్ళీ ముగ్గురికి టాస్క్ ఉంటుంది. నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి ఇస్తున్న చివరి టాస్క్ అని బిగ్ బాస్ చెప్తాడు. ఈ టాస్క్ లో ముగ్గురు పాల్గొంటారు. అందులో తనూజ విన్ అవుతుంది
ఓడిపోయినందుకు ఇమ్మాన్యుయేల్ ఏడుస్తాడు. ఈ వారం ఒక్క టాస్క్ కూడా ఓడిపోలేదు కానీ ఇక జరిగిందంటూ ఎమోషనల్ అవుతాడు. లీడర్ బోర్డులో తనూజ టాప్ లో ఉంటుంది. దాంతో తనని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. మీరు నామినేషన్ నుండి సేవ్ అవ్వాలంటే.. మీ దగ్గరున్న మనీ పాయింట్స్ ప్రైజ్ మనీ నుండి కట్ అవుతుందని బిగ్ బాస్ చెప్తాడు. వద్దు బిగ్ బాస్ నేను ఆడియన్స్ ద్వారా వెళ్తానని తనూజ చెప్తుంది. అంటే మీరు ఇప్పుడు నామినేషన్ నుండి సేవ్ అవ్వకుండా మీ భవిష్యత్తును ప్రేక్షకుల చేతిలో పెడుతున్నారా అని బిగ్ బాస్ అడుగగా.. అవును బిగ్ బాస్ అని తనూజ చెప్తుంది. దాంతో సరే అని చెప్పి తనూజని వెళ్ళమని చెప్తాడు. మరి తనూజ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా కామెంట్ చేయండి.
![]() |
![]() |